శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 23:39:23

వెబ్‌సిరీస్‌లో యువీ

 వెబ్‌సిరీస్‌లో యువీ

గువాహటి: మెరుపు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో దశాబ్దానికి పైగా అభిమానులను అలరించిన టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ నటనతోనూ మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. తన సోదరుడు జొరావర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో యువరాజ్‌ సతీసమేతంగా కనిపించనున్నాడు. అసోంకు చెందిన డ్రీమ్‌ హౌస్‌ ప్రొడక్షన్స్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తుండగా.. యువీ తల్లి షబ్నమ్‌ సింగ్‌ సైతం నిర్మాణంలో భాగస్వామి కావడం విశే షం. ఈ విషయాన్ని డ్రీమ్‌హౌస్‌కు చెందిన నీతా శర్మ మంగళవారం వెల్లడించింది. యువీ తమ బ్యానర్‌లో నటిస్తుండడం గౌరవంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేసిం ది. వెబ్‌సిరీస్‌లో భాగమవడంపై సంతోషంగా ఉందని యువరాజ్‌ తల్లి షబ్నమ్‌ చెప్పారు.  యువీ గతేడాది జూన్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 


logo