శుక్రవారం 29 మే 2020
Sports - Mar 31, 2020 , 22:12:21

ధోనీ, కోహ్లీ కంటే దాదా న‌యం: యువీ

ధోనీ, కోహ్లీ కంటే దాదా న‌యం: యువీ

ధోనీ, కోహ్లీ కంటే దాదా న‌యం: యువీ 

న్యూఢిల్లీ:  భార‌త కెప్టెన్ల‌లో మ‌హేంద్ర‌సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కంటే సౌర‌వ్ గంగూలీ త‌న‌కు చాలా మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని యువ‌రాజ్ సింగ్ అన్నాడు. ధోనీ, కోహ్లీ క‌న్నా దాదా ఇచ్చిన ప్రోత్సాహం మ‌రువ‌లేనిద‌ని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. అయితే బెస్ట్ కెప్టెన్ ఎవ‌ర‌న్న విష‌యానికొస్తే మాత్రం దాదా, ధోనీలో ఎవ‌రినో ఒక‌రిని ఎంచుకోవ‌డం మాత్రం క‌ష్ట‌మ‌న్నాడు. మంగ‌ళ‌వారం ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడుతూ ‘దాదా నాయ‌క‌త్వంలో అరంగేట్రం చేసిన నాకు చాలా మ‌ద్ద‌తు ద‌క్కింది. నా కెరీర్‌లో ఎన్నో మ‌రుపురాని జ్ఞాప‌కాలు అత‌ని హ‌యంలోనే ఉన్నాయి. ఆ త‌ర్వాత ధోనీ, కోహ్లీ నాయ‌క‌త్వంలో నాకు ఆశించినంతా మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు’ అని యువీ అన్నాడు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ పై స్పందిస్తూ ‘మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేలాది మంది చ‌నిపోవ‌డం గుండెలు బ‌రువెక్కెలా చేస్తున్న‌ది. వైర‌స్ గురించి భ‌య‌ప‌డ‌టం కంటే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్‌సైట్ చూస్తే ప్ర‌జ‌ల‌కు అన్ని అర్థ‌మ‌వుతాయి’ అని యువీ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే 2011లో భార‌త్.. ప్ర‌పంచ‌క‌ప్ గెలువ‌డంలో కీల‌క భూమిక పోషించిన ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ‌తేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. 


logo