గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 14, 2021 , 02:45:32

అప్పరాల క్రీడాకారులు అదుర్స్‌

అప్పరాల క్రీడాకారులు అదుర్స్‌

  • యూత్‌గేమ్స్‌ గోల్డెన్‌ కప్‌లో పతకాల జోరు 

కొత్తకోట, ఫిబ్రవరి 13 : యూత్‌ గేమ్స్‌ అంతర్జాతీయ స్థాయి గోల్డెన్‌ కప్‌ 2020-21లో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల క్రీడాకారులు అదరగొట్టారు. ఖాఠ్మండ్‌(నేపాల్‌)లోని రంగశాల స్టేడియంలో జరుగుతున్న టోర్నీ లాంగ్‌జంప్‌ పోటీలో కోమారి వెంకటేశ్‌ రజత పతకంతో మెరిశాడు. పురుషుల 200మీటర్ల పరుగు పందెంలో షఫిన్‌కు స్వర్ణం దక్కగా, 800మీటర్ల విభాగంలో షమీర్‌ రెండో స్థానం, 200మీటర్ల కేటగిరీలో మోహన్‌ ద్వితీయ స్థానంలో నిలిచాడు. వీరంతా అప్పరాల గ్రామానికి చెందినవారే. లాంగ్‌జంప్‌లో వెంకటేశ్‌ రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాగార్జునసాగర్‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వెంకటేశ్‌ది వ్యవసాయ కుటుంబం. 

VIDEOS

logo