గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 12, 2020 , 15:36:36

టీ20 వరల్డ్‌కప్‌ వరకు అతనే బ్యాటింగ్‌ కోచ్‌

టీ20 వరల్డ్‌కప్‌ వరకు అతనే బ్యాటింగ్‌ కోచ్‌

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, ఆ జట్టు ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ యూనీస్‌ ఖాన్‌ పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) గురువారం ప్రకటించింది. 2022లో  ఆస్ట్రేలియా   వేదికగా జరిగే ట్వంటీ 20 ప్రపంచ కప్ వరకు మాజీ కెప్టెన్ పురుషుల బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతారని  పీసీబీ తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టులో  ఇంగ్లాండ్‌  పర్యటనకు వెళ్లిన పాక్‌ జట్టుకు   ఖాన్‌ను మొదట బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించారు.  పాక్‌ జట్టుతో కలిసి యూనీస్‌ త్వరలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనున్నాడు. డిసెంబరు 18న ఆరంభంకానున్న పర్యటనలో  ఆతిథ్య  కివీస్‌తో పాక్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.