శుక్రవారం 03 జూలై 2020
Sports - Jun 09, 2020 , 14:41:58

బ్యాటింగ్‌ కోచ్‌గా యూనిస్‌ ఖాన్‌

 బ్యాటింగ్‌ కోచ్‌గా యూనిస్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌:  పాకిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా యూనిస్‌ ఖాన్‌కు పేరున్నది. తాజాగా ఆ జట్టు మాజీ కెప్టెన్‌ యూనిస్‌ ఖాన్‌ను జాతీయ పురుషుల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేశారు. త్వరలో జరిగే ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు యూనిస్‌ సహాయ కోచ్‌గా ఉంటాడని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం తెలిపింది.  

అలాగే, మణికట్టు స్పిన్నర్‌, వెటరన్‌ ఆటగాడు ముస్తాక్‌ అహ్మద్‌ను  స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. అహ్మద్‌ జట్టు మెంటార్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లే పాక్‌ జట్టు మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనుంది.  పాక్‌ హెడ్‌కోచ్‌గా మిస్బా హుల్‌ హక్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా వకార్‌ యూనిస్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 


logo