సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 01:50:39

ఐపీఎల్‌కు ఎంపిక కాలేదని..యువ క్రికెటర్‌ ఆత్మహత్య

 ఐపీఎల్‌కు ఎంపిక కాలేదని..యువ క్రికెటర్‌ ఆత్మహత్య

ముంబై: ఐపీఎల్‌ ఆశలు ఒక యువ క్రికెటర్‌ భవిష్యత్తును బలి తీసుకున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీకి ఎంపిక కాలేదన్న మనస్తాపంతో ముంబై యువ బౌలర్‌  కరణ్‌ తివారీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోకుల్‌ధామ్‌లోని మలాద్‌ రెసిడెన్సీలో సోమవారం రాత్రి తివారీ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మధ్యాహ్నం అవుతున్నా.. గది తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపులు పగులగొట్టి అతడిని దవాఖానకు తరలించినా..అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆత్మహత్య కేసుగా నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీస్‌ అధికారి బాబాసాహెబ్‌ సాలుంకే తెలిపారు. కాగా ముంబై క్లబ్‌ క్రికెట్‌లో జూనియర్‌ స్టెయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరణ్‌ తివారీ ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఉదయ్‌పూర్‌లో ఉన్న తన స్నేహితునికి ఫోన్‌ చేసి చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న తివారీ సోదరికి సదరు స్నేహితుడు ఫోన్‌ చేసి చెప్పినా అప్పటికే  ఘోరం జరిగిపోయింది. 


logo