శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 24, 2020 , 14:59:38

సచిన్‌, కోహ్లీలను గుర్తు చేసిన ట్రంప్‌

సచిన్‌, కోహ్లీలను గుర్తు చేసిన  ట్రంప్‌

అహ్మదాబాద్‌:   మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.  ట్రంప్‌ తన ప్రసంగంలో భారత్‌కు చెందిన చాలా అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత సినిమాలు, క్రికెట్‌, సైన్యం, చంద్రయాన్ 2‌, మహాత్మా గాంధీ, వివేకానాంద, సర్దార్‌ పటేల్‌, ఉగ్రవాదం  తదితర అంశాలపై మాట్లాడారు.   భారతీయ సినిమాలు డీడీఎల్‌, షోలే గ్రేట్‌ అని చెప్పిన ట్రంప్‌ భారతీయ హోళీ, దీపావళి పండుగలను ప్రస్తావించారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌లో పాల్గొనడం తన అదృష్టమని ట్రంప్‌ పేర్కొన్నారు.  టీమ్‌ఇండియా క్రికెట్‌ గురించి కూడా మాట్లాడారు. దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లాంటి అద్భుతమైన ఆటగాళ్లు భారత్‌లో ఉన్నారని కొనియాడారు. ఎంతో మంది గొప్ప క్రికెటర్లను ఇక్కడి ప్రజలు ఆరాధిస్తున్నారు అని ట్రంప్‌ వివరించారు. మొతెరా స్టేడియం నవ చరిత్రకు వేదిక అని ప్రధాని మోదీ అన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జైషా కార్యక్రమంలో పాల్గొన్నారు. logo