ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 18, 2020 , 00:16:26

క్రీడగా యోగాసన

క్రీడగా యోగాసన

న్యూఢిల్లీ: భారతీయ ప్రాచీన సాధన ‘యోగాసన’ను పోటీ క్రీడగా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ గుర్తించింది. దీంతో ఇప్పటి నుంచి యోగా అభివృద్ధికి సైతం కేంద్రం నిధులను మంజూరు చేయనుంది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు, ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ యశో నాయక్‌ పాల్గొని యోగాకు క్రీడా గుర్తింపునిచ్చారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచి, శారీరక, మానసిక దృఢత్వం పెంచుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ అడుగువేసిందని చెప్పారు. ‘యోగాసన ఎప్పటి నుంచో పోటీ క్రీడగా ఉంది. అయితే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందలేదు. ఇప్పుడు అధికారిక క్రీడగా మారింది. జాతీయ యోగాసన స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌(ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ)కు ఆర్థిక చేయూతనందిస్తాం. వార్షిక ట్రైనింగ్‌ క్యాలెండర్‌కు సాయం అందిస్తాం’ అని రిజిజు చెప్పారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యోగాసన స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ను నిర్వహించాలని, ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పోటీలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది.


logo