శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Feb 10, 2020 , 23:26:52

ఐసీసీ జట్టులో యశస్వి, రవి, కార్తీక్‌

 ఐసీసీ జట్టులో యశస్వి, రవి, కార్తీక్‌

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో భారత్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. టోర్నీలో అత్యధిక పరుగులు (400) చేసిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, అత్యధిక వికెట్లు (17) తీసిన లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌తో పాటు పేసర్‌ కార్తీక్‌ త్యాగి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ సారథిగా ఎంపికయ్యాడు. భారత్‌, బంగ్లాదేశ్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్లు.. వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఇద్దరేసి ప్లేయర్లు శ్రీలంక నుంచి ఒకరు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. కెనడాకు చెందిన అఖిల్‌ కు మార్‌ పన్నెండో ఆటగాడిగా ఎంపికయ్యాడు. 


ఐసీసీ అండర్‌-19 జట్టు

యశస్వి జైస్వాల్‌, రవి బిష్ణోయ్‌, కార్తీక్‌ త్యాగి (భారత్‌), అక్బర్‌ అలీ (కెప్టెన్‌), మహ్ముదుల్‌ హసన్‌, షహాదత హుసేన్‌ (బంగ్లాదేశ్‌), ఇబ్రహీం జద్రాన్‌, షఫీఖుల్లా గఫారీ (ఆఫ్ఘనిస్థాన్‌), రవిందు రసంత (శ్రీలంక), నీమ్‌ యాంగ్‌, జైడెన్‌ సీల్స్‌ (వెస్టిండీస్‌), అఖిల్‌ కుమార్‌ (12వ ఆటగాడు, కెనడా).
logo