శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 15:57:01

బౌలింగ్‌ మార్పు మంచిదే: కీలక వికెట్‌ కోల్పోయిన పాక్‌

బౌలింగ్‌ మార్పు మంచిదే:  కీలక వికెట్‌ కోల్పోయిన పాక్‌

అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది.

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఆరంభంలోనే 34/2తో కష్టాల్లో పడిన పాకిస్థాన్‌ జట్టును ఓపెనర్‌ హైదర్‌ అలీ(56) అర్ధశతకంతో ఆదుకున్నాడు. కెప్టెన్‌ నజీర్‌ సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ హైదర్‌కు సహకారం అందించాడు. వీరిద్దరు కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్పెషలిస్ట్‌ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నారు.

ఈ దశలో పార్ట్‌టైం లెగ్‌స్పిన్నర్‌ యశస్వి జైశ్వాల్‌కు బంతి అందుకున్నాడు. యువ భారత్‌ కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ బౌలింగ్‌లో మార్పు చేయడం మంచి ఫలితాన్నే ఇచ్చింది.    యశస్వి తన తొలి ఓవర్లోనే    దూకుడుగా ఆడుతున్నహైదర్‌ ఔట్‌  చేసి ఆకట్టుకున్నాడు.  దీంతో ఎప్పటి నుంచో ఈ జోడీని విడగొట్టాలని ప్రయత్నిస్తున్న భారత్‌ ఆశ నెరవేరింది. 30 ఓవర్లలో పాక్‌ 3 వికెట్లకు 118 పరుగులు చేసింది. నజీర్‌(41) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. logo