శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 03, 2021 , 01:15:50

సీఎం జన్మదినం సందర్భంగా యాగం

సీఎం జన్మదినం సందర్భంగా యాగం

వేములవాడ, ఫిబ్రవరి 2: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న అధిశ్రవణయాగం నిర్వహించనున్నట్లు సాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో యాగాన్ని నిర్వహించనున్నామని, ఇందులో భాగంగానే రాజన్నను దర్శించుకొని, యాగం కోసం అనుమతి తీసుకున్నామన్నారు. ఉదయం మహాగణపతిపూజ, పుణ్యాహవాచనం, పాలికా ప్రయో గం, ఆచార్యాది రిత్విక్‌, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట 64 గణపతుల హవనాలు, ఆదిత్యాది నవగ్రహ, చతుషష్ఠి, అధిశ్రవణ మహారుద్రయాగం, దుర్గాహవనం, పూర్ణాహుతితో యాగం పూర్తవుతుందన్నారు. ఈ యాగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించామని తెలిపారు.

VIDEOS

logo