శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 15:13:59

కోవిడ్‌-19 నుంచి కోలుకున్న రెజ్ల‌ర్ వినేష్‌ ఫోగాట్‌

కోవిడ్‌-19 నుంచి కోలుకున్న రెజ్ల‌ర్ వినేష్‌ ఫోగాట్‌

హైద‌రాబాద్ : భార‌త ప్ర‌ముఖ మ‌హిళా రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్(24) క‌రోనావైర‌స్ నుండి కోలుకుంది. రెండోసారి నిర్వ‌హించిన కోవిడ్ టెస్ట్ సైతం నెగెటివ్‌గా వ‌చ్చిన‌ట్లు తెలిపింది. కాగా ముందు జాగ్ర‌త్త‌గా మ‌రికొన్ని రోజుల‌పాటు ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్న‌ట్లు చెప్పింది. కోవిడ్ పాజిటివ్ కార‌ణంగా ఆగ‌స్టు 29న జ‌రిగిన వ‌ర్చువ‌ల్ నేష‌న‌ల్ స్పోర్ట్స్ అవార్డుల వేడుక‌లో పాల్గొన‌లేదు. రాజీవ్ ఖేల్‌ర‌త్నా అవార్డును అందుకోలేక‌పోయింది. మంగ‌ళ‌వారం కోవిడ్‌-19 ప‌రీక్ష చేయించుకున్న‌ట్లు ఫ‌లితం నెగెటివ్‌గా వ‌చ్చింద‌న్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన ఏకైక మ‌హిళా రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్‌. త‌న ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్ర‌తి ఒక్క‌రికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లక్నోలో జ‌రిగే మహిళల జాతీయ శిక్షణా శిబిరాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. ఈ శిబిరం సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. కాగా పురుషుల శిబిరం సోనెపట్‌లో షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైంది.


logo