e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News Ravi Kumar Dahiya: ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం చేసిన రెజ్ల‌ర్‌ ర‌వికుమార్‌

Ravi Kumar Dahiya: ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం చేసిన రెజ్ల‌ర్‌ ర‌వికుమార్‌

టోక్యో: ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం చేశాడు రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా. బుధ‌వారం జ‌రిగిన‌ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌న‌యేవ్‌పై అత‌డు గెలిచాడు. విక్ట‌రీ బై ఫాల్‌గా అత‌న్ని విజేత‌గా ప్ర‌క‌టించారు. ఈ విజ‌యంతో ఫైన‌ల్లో అడుగుపెట్టిన ర‌వికుమార్‌.. ఇండియాకు క‌నీసం సిల్వ‌ర్ మెడ‌ల్ ఖాయం చేయ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్‌, యోగేశ్వ‌ర్‌ద‌త్‌లు మాత్ర‌మే ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్స్ అందించారు. వాళ్ల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన మూడో రెజ్ల‌ర్‌గా ర‌వికుమార్ ద‌హియా నిలిచాడు.

బుధ‌వారం ఉద‌యం నుంచి ర‌వికుమార్ మొత్తం బౌట్లు గెలిచి మెడ‌ల్ ఖాయం చేయ‌డం విశేషం. సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమ‌యంలో ర‌వికుమార్ అత‌న్ని రింగ్ బ‌య‌ట‌కు తోసే క్ర‌మంలో నూరిస్లామ్ కాలికి గాయ‌మైంది. కాలికి క‌ట్టుకొని మ‌ళ్లీ రింగులోకి వ‌చ్చినా.. అత‌డు ర‌వికుమార్ ప‌ట్టుకు నిలవ‌లేక‌పోయాడు. దీంతో రిఫ‌రీ ర‌వికుమార్‌ను విక్ట‌రీ బై ఫాల్ కింది విజేత‌గా ప్ర‌క‌టించాడు.

- Advertisement -

బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన తొలి బౌట్‌లో ర‌వికుమార్ ద‌హియా.. కొలంబియా రెజ్ల‌ర్ టైగ్రెరోస్ అర్బానోపై 13-2తో ఈజీగా గెలిచి క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత క్వార్ట‌ర్స్‌లో బ‌ల్గేరియాకు చెందిన జార్జి వ‌లెంటినోవ్‌పై 14-4 తేడాతో విజ‌యం సాధించాడు. ఇక సెమీఫైన‌ల్లోనూ స‌త్తా చాటి ఫైన‌ల్లో అడుగుపెట్టాడు. గెలిస్తే గోల్డ్ మెడ‌ల్ సాధించిన తొలి ఇండియ‌న్ రెజ్ల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. లేదంటే క‌నీసం సిల్వ‌ర్ మెడ‌ల్ అయితే ప‌క్కాగా తీసుకురానున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana