శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 07, 2020 , 01:57:23

దీపక్‌ పునియా డిశ్చార్జ్‌

దీపక్‌ పునియా డిశ్చార్జ్‌

న్యూఢిల్లీ: భారత యువ రెజ్లర్‌ దీపక్‌ పునియా ఆదివారం దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. కొద్ది రోజుల క్రితం పునియాకు పాజిటివ్‌ అని తేలడంతో ముందు జాగ్రత్తగా దవాఖానలో చేరాడు. అయితే వైరస్‌ లక్షణాలు లేకపోవడానికి తోడు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలంటూ డాక్టర్లు సూచించారు. ఈ విషయాన్ని జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ అధికారి ధృవీకరించినట్లు భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్‌) ఒక ప్రకటనలో పేర్కొంది. రాహుల్‌ అవారెకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


logo