మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Sep 30, 2020 , 03:28:33

క్రూరత్వం కన్నా ఘోరం

క్రూరత్వం కన్నా ఘోరం

  • హాథ్రస్‌ ఘటనపై కోహ్లీ ఆగ్రహం

అబుదాబి: హాథ్రస్‌ లైంగికదాడి బాధితురాలికి న్యాయం జరుగుతుందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ ఘటన క్రూరత్వాని కన్నా దారుణమైనదని ఆవేదన చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో సెప్టెంబర్‌ 14వ తేదీన 19 ఏండ్ల యువతిపై నలుగురు మృగాళ్లు లైంగికదాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం సోమవారం ఢిల్లీలోని దవాఖానకు తరలించగా.. కోలుకోలేక ఆమె మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ కోసం యూఏఈలో ఉన్న కోహ్లీ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘హాథ్రస్‌లో జరిగిన ఘటన అమానవీయం, క్రూరత్వాని కన్నా ఘోరం. ఇంత దారుణమైన నేరానికి పాల్పడిన దోషులకు కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. బాధితురాలికి న్యాయం జరుగాలి’ అని ట్వీట్‌ చేశాడు.