ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరు వాయిదా

న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పోరు జూన్ 18 నుంచి 22 వరకు జరగనుంది. జూన్ 23ను రిజర్వ్‌డేగా ప్రకటించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జూన్ 10 నుంచి 14 వరకు ఫైనల్ జరగాల్సి ఉంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 సీజన్ తుది పోరును దృష్టిలో ఉంచుకొని తేదీల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఐపీఎల్-14వ సీజన్ షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ అగ్రస్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్-2లో ఉన్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ సమయంలో భారత్ ఏ సిరీస్‌లోనూ పాల్గొనదు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఛాంపియన్షిప్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు సమాచారం. కరోనా కారణంగా ఆటగాళ్ల క్వారంటైన్ గడువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాయింట్ల విధానం మారిందిలా..
కరోనా మహమ్మారి కారణంగా చాలా టెస్టు సిరీస్‌లు రద్దవడంతో చాంపియన్‌షిప్ పాయింట్ల విధానంలో ఐసీసీ మార్పులు చేసింది. సిరీస్‌లోని మొత్తం పాయింట్లలో.. ఓ జట్టు గెలిచిన పాయింట్ల శాతం ప్రకారం ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తున్నది. ఏ టెస్టు సిరీస్‌కైనా 120 పాయింట్లు ఉంటాయి. ఉదాహరణకు భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌నే తీసుకుంటే గెలిస్తే 30, టై అయితే 15, డ్రాకు 10 పాయింట్లు జట్టు ఖాతాలో చేరుతాయి. ఇలా రెండింట్లో ఏ టీమ్ సిరీస్‌లో ఎక్కువ పాయింట్లను ఖాతాలో వేసుకుంటుందో ఆ జట్టుకు అధిక శాతం వస్తుంది. ఒకవేళ పాయింట్ల శాతం కూడా సమానమైతే చేసిన పరుగులు, పడగొట్టిన వికెట్ల ఆధారంగా శాతాలను ఐసీసీ లెక్కేస్తుంది.
తాజావార్తలు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల