ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ తనకు వరల్డ్‌కప్ ఫైనల్‌తో సమానమని న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ చెప్పాడు. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్, భారత జట్టు తలపడనున్నాయి. ఛాంపియన్‌షిప్‌కు ముందు జూన్ 2 నుంచి లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కివీస్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనుంది.
‘అవును, ఇది(డబ్ల్యూటీసీ ఫైనల్) నాకు ప్రపంచకప్ ఫైనల్ లాంటిది. నా కెరీర్లో అతిపెద్ద నిరాశ ఏమిటంటే.. నేను న్యూజిలాండ్ తరఫున ఎప్పుడూ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. టీ20 లేదా వన్డే మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాకపోవచ్చు’ అని వాగ్నర్ పేర్కొన్నాడు. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ఉంది.