మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 12:28:10

అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా ఒసాకా

అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా ఒసాకా

హైదరాబాద్‌: ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా జపాన్‌కు చెందిన టెన్నిస్‌ సంచలనం నవోమీ ఒసాకా నిలింది. దీంతో అమెరికన్‌ దిగ్గజం సెరీనా విలియమ్స్‌ను ఆమె వెనక్కినెట్టింది. గత పన్నెండు నెలల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ప్రకటించిన జాబితాలో రూ.284.20 కోట్లతో (37.4 మిలియన్‌ డాలర్లు) అగ్రస్థానంలో నిలిచింది. ఎండార్సుమెంట్లు, ప్రైజ్‌మనీ రూపంలో సెరెనా కంటే రూ.10.64 కోట్లు (1.4 మిలియన్‌ డాలర్లు) సంపాదించింది. 

22 ఏండ్ల ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుపొందింది. ఇప్పటివరకు రష్యా క్రీడాకారిణి షరపోవా పేరుతో ఉన్న రికార్డును ఆమె చెరిపివేశారు. షరపోవా 2015లో 29.7 మిలియన్‌ డాలర్లు సంపాదించింది. ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న 100 మంది అథ్లెట్లతో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది.


logo