టోక్యో: టెన్నిస్ వుమెన్స్ సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ వన్, వింబుల్డన్ చాంపియన్ ఆష్లీ బార్టీ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. స్పెయిన్‌కు చెందిన సారా సోరిబ్స్ టోర్మో చేతిలో 4-6, 3-6 తేడాతో ఆమె పరాజయం పాలైంది. రెండు సెట్లలోనే ఆమె రెండేసి సర్వ్‌లను ఆమె కోల్పోయింది. 27 అనవసర తప్పిదాలు బార్టీ కొంప ముంచాయి. 48వ ర్యాంకర్ అయిన తాను వరల్డ్ నంబర్ వన్ను ఓడించడం చాలా సంతోషంగా ఉన్నదని మ్యాచ్ తర్వాత సారా సోరిబ్స్ చెప్పింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా సింగిల్స్ ప్లేయర్‌గా నిలవాలనుకున్న బార్టీకి.. ఇలా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం మింగుడుపడనిదే.