e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home స్పోర్ట్స్ స్టార్ల ముందంజ

స్టార్ల ముందంజ

  • మూడో రౌండ్‌లో జొకో, ఫెదరర్‌
  • గాయంతో బార్టీ నిష్క్రమణ.. ఫ్రెంచ్‌ ఓపెన్‌
స్టార్ల ముందంజ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ప్రపంచ అగ్రర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌, రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ముందడుగేశారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సెర్బియా స్టార్‌ జొకో 6-3, 6-2, 6-4 తేడాతో పాబ్లో క్యువెస్‌ (ఉరుగ్వే)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మ్యాచ్‌ మొత్తం 10 ఏస్‌లు, 32 విన్నర్లు సాధించిన నొవాక్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మరో మ్యాచ్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు ఫెదరర్‌ కష్టపడి గెలిచాడు. అన్‌సీడెడ్‌ మారిన్‌ సిలిక్‌పై 6-2, 2-6, 7-6 (7/4), 6-2తో నాలుగు సెట్ల పాటు పోరాడి ఫెడ్‌ మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. రెండో సెట్‌ కోల్పోయి.. మూడో సెట్‌ టై బ్రేకర్‌కు వెళ్లి ఉత్కంఠ రేగిన సమయంలో ఫెదరర్‌ విజృంభించాడు. వరుసగా రెండు సెట్లు దక్కించుకున్నాడు. రెండున్నర గంటలు సాగిన మ్యాచ్‌లో ఫెదరర్‌ 16 ఏస్‌లతో విరుచుకుపడ్డాడు. రెండో సీడ్‌ డానిల్‌ మద్వెదెవ్‌ (రష్యా) 3-6, 6-1, 6-4, 6-3తో పౌల్‌పై గెలిచాడు.

బార్టీకి నిరాశ
ప్రపంచ నంబర్‌వన్‌ ఆష్లే బార్టీ గాయం కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది. మగ్దా లినెటె తో జరిగిన సింగిల్స్‌ రెండో రౌండ్‌లో తుంటి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడిన బార్టీ 1-6, 2-2తో వెనుకబడిన సమయంలో నిష్క్రమించింది. టోర్నీ నుంచి ఈ విధంగా వెళ్లిపోవడం మనసుకు ఎంతో బాధకలిగిస్తున్నదని ఆష్లే చెప్పింది. క్విటోవా కూడా గాయం వల్ల మ్యాచ్‌ ఆడకుండానే ఔట్‌ కాగా.. ప్లిస్కోవా 5-7, 1-6తో స్టీఫెన్స్‌ చేతిలో ఓడింది. సోఫియా కెనిన్‌, స్వితోలినా, కోకో గాఫ్‌ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు.

ప్రిక్వార్టర్స్‌లో బోపన్న
పురుషుల డబుల్స్‌లో భారత సీనియర్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న, ఫ్రాంకో స్కుగోర్‌ (క్రొయేషియా) ద్వ యం ప్రిక్వార్టర్స్‌కు చేరింది. రెండో రౌండ్‌లో బోపన్న జోడీ 6-4, 7-5 తేడాతో అమెరికా ద్వయం ఫ్రాన్సెస్‌ టియాఫో, నికోలస్‌ మొన్రోయ్‌పై విజయం సాధించింది.

ఒసాకకు హామిల్టన్‌ మద్దతు
మానసిక ఆందోళన కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన నవోమీ ఒసాకకు ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్‌ మద్దతు తెలిపాడు. మానసిక సమస్య వల్ల మీడియాతో మాట్లాడకూడదని ఒసాక నిర్ణయించుకున్నాక.. ఆమె పట్ల ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులు వ్యవహరించిన తీరును తప్పుపట్టాడు. ఒసాకకు మద్దతుగా కామ్‌ అనే యాప్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్టార్ల ముందంజ

ట్రెండింగ్‌

Advertisement