సోమవారం 06 జూలై 2020
Sports - May 29, 2020 , 22:53:21

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ జూనియర్‌ టోర్నీ వాయిదా

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ జూనియర్‌ టోర్నీ వాయిదా

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్లూ్యఎఫ్‌) శుక్రవారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ వేదికగా జరగాల్సిన ఈ మెగాటోర్నీని వచ్చే ఏడాది జనవరి 18-24 మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 11 నుంచి 16 మధ్య ప్రపంచ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ జరుపనున్నట్లు పేర్కొంది.


 


logo