శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 23:42:06

విశ్వక్రీడలు ఆలస్యం కావొచ్చు

విశ్వక్రీడలు ఆలస్యం కావొచ్చు

  • ప్రపంచ అథ్లెటిక్స్‌ చీఫ్‌ సెబాస్టియన్‌ 

లండన్‌: టోక్యో ఒలింపిక్స్‌ ఈ ఏడాది ఆఖరుకు వాయిదా పడే అవకాశం ఉందని ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్‌ కోయ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) విజృంభణతో విశ్వక్రీడలు వాయిదా వేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయి తే ఇప్పుడే ఒలింపిక్స్‌పై నిర్ణయం తీసుకుంటే అది తొందరపాటు అవుతుందని సెబాస్టియన్‌ గురువారం బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌కు ఒలింపిక్స్‌ వాయిదా పడనుందా అన్న ప్రశ్నకు ‘ఆలస్యమయ్యేందుకు అవకాశముంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం కాదిది. ఏది ఏమైనా ఒలింపిక్స్‌ జరపాల్సిందేనని ఇతర క్రీడా సమాఖ్యలు ఐవోసీ సమావేశంలో చెప్పలేదు’అని సెబాస్టియన్‌ బదులిచ్చారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జూలై 24నుంచి ఆగస్టు 9వరకు టోక్యో వేదికగా ఒలింపిక్‌ క్రీడలు జరగాల్సి ఉంది.


logo