సోమవారం 25 మే 2020
Sports - Apr 08, 2020 , 20:34:26

ప్ర‌పంచ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్ వాయిదా

ప్ర‌పంచ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్ వాయిదా


లండ‌న్: ప‌్ర‌మాద క‌రోనా వైర‌స్ కార‌ణంగా టోర్నీల ర‌ద్దు, వాయిదాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డ‌గా, తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్ వంతు వ‌చ్చింది. వాస్త‌వానికి వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌రుగాల్సి ఉన్నా..టోక్యో ఒలింపిక్స్ రీషెడ్యూల్‌(జూలై 21 నుంచి ఆగ‌స్టు 8)తో వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ టోర్నీ తేదీల‌ను మార్చాల్సి వ‌చ్చింది. ఈ రెండు టోర్నీల షెడ్యూల్ దాదాపు ఒకే స‌మ‌యంలో జ‌రుగుతుండటం వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌పంచ అథ్లెటిక్స్ స‌మాఖ్య బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కొత్త షెడ్యూల్ ప్ర‌కారం ఒరెగాన్‌(అమెరికా)లో 2022 జూలై 15 నుంచి 24 వ‌ర‌కు వ‌రల్డ్ అథ్లెటిక్స్ టోర్నీ జ‌రుగుతుంది. మ‌రోవైపు 2022 బ‌ర్మింగ్‌హామ్ కామ‌న్వెల్త్‌(జూలై 27-ఆగ‌స్టు 7), యూరోపియ‌న్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌ను ద్రుష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేయాల్సి వ‌చ్చింద‌ని వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ స‌మాఖ్య చీఫ్ సెబాస్టియ‌న్ కో అన్నారు. ఆరు వారాల వ్య‌వ‌ధిలో మూడు మేజ‌ర్ ఈవెంట్లు జ‌రుగ‌నున్నాయ‌ని, అథ్లెట్ల‌కు ఇది బొనాంజా అని కో తెలిపారు. 


logo