శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 00:51:40

సెమీస్‌లో ఆస్ట్రేలియా

 సెమీస్‌లో ఆస్ట్రేలియా
  • మహిళల టీ20 ప్రపంచకప్‌

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా సత్తాచాటింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆసీస్‌ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 6 పాయింట్లతో గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఇదే గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు 8 పాయింట్లతో ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్లు కూడా సెమీస్‌లో అడుగుపెట్టాయి. దక్షిణాఫ్రికా మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉండటంతో ప్రస్తుతానికి భారత ప్రత్యర్థి ఖరారు కాలేదు. సోమవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. మూనీ (60) అర్ధశతకంతో ఆకట్టుకుంది. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. కేటీ మార్టీన్‌ (37) టాప్‌ స్కోరర్‌. 
logo