శనివారం 28 మార్చి 2020
Sports - Feb 09, 2020 , 00:27:22

షఫాలీ, మంధన మెరుపులు

 షఫాలీ, మంధన మెరుపులు
  • ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత మహిళల జట్టు

మెల్‌బోర్న్‌: ముక్కోణపు టీ20 టోర్నీలో ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. భారీ లక్ష్యం కండ్ల ముందున్నా ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా అవలీలగా కొట్టేసింది. టాపార్డర్‌ సమిష్ఠిగా రాణించడంతో శనివారం ఇక్కడ జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఆష్లే గార్నర్‌ (57 బంతుల్లో 93; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం టార్గెట్‌ ఛేజింగ్‌లో స్మృతి మంధన (48 బంతుల్లో 55; 7 ఫోర్లు), షఫాలీ వర్మ (28 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (19 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్‌ 19.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. 


logo