మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 08, 2020 , 00:54:31

మన అమ్మాయిలకు మరో ఓటమి

  మన అమ్మాయిలకు మరో ఓటమి

మెల్‌బోర్న్‌: ముక్కోణపు టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మన అమ్మాయిలు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 123 పరుగులు చేశారు. స్మృతి మంధన (40 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా తక్కినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనంతరం లక్ష్యఛేదనలో స్కీవర్‌ (50) అర్ధశతకంతో ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్‌ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.


logo
>>>>>>