సోమవారం 25 మే 2020
Sports - Apr 02, 2020 , 18:14:06

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!

దుబాయ్‌: క‌్రికెట్లో  పురుషుల‌కు తాము ఏమాత్రం తీసిపోమ‌ని మ‌హిళ‌లు నిరూపించారు. స‌రైన ఆద‌ర‌ణ‌, ప్రోత్సాహామిస్తే త‌మ స‌త్తా ఏంటో చూపెడుతామ‌ని స‌రికొత్త రికార్డుల ద్వారా చూపెట్టారు. అవును ఇటీవ‌ల ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన మ‌హిళల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ‌రో చ‌రిత్ర నెల‌కొల్పింది. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఆతిథ్య ఆసీస్‌, భార‌త్ మ‌ధ్య జ‌రిగిన ఫైనల్ ఫైట్ ను మ‌న దేశంలో ఏకంగా 90 ల‌క్ష‌ల మంది టెలివిజ‌న్ల‌లో  వీక్షించార‌ట‌. ఇది కేవ‌లం భార‌త్‌కు ప‌రిమితం  కాలేదు..క్రికెట్‌ను అభిమానించే మిగ‌తా దేశాల్లోనూ రికార్డు స్థాయిలో అభిమానులు టీవీల్లో మ్యాచ్ ను చూశార‌ని ఐసీసీ గురువారం పేర్కొంది. ఇది ఇక్క‌డితోనే ఆగిపోలేదు. మెగాటోర్నీ మ్యాచ్‌ల‌ను దేశ‌వ్యాప్తంగా 5.4 బిలియ‌న్ల నిమిషాల పాటు చూసినట్లు ఐసీసీ వెల్ల‌డించింది. ఒక్కో మ్యాచ్‌ను ఎంతసేపు వీక్షించారు అన్న‌దాన్ని బ‌ట్టి ఈ గ‌ణాంకాల‌ను విడుద‌ల చేశారు. ఇది టెలివిజ‌న్ వీక్ష‌కుల వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. టోర్నీ జ‌రిగిన ఫిబ్రవ‌రి 21 నుంచి మార్చి 8 వ‌ర‌కు 1.1 బిలియ‌న్ వీడియోల వీక్ష‌ణ న‌మోదు అయ్యింది. మ‌హిళల క్రికెట్‌లో ఇది స‌రికొత్త రికార్డు. అంతేకాదు 2019 పురుషుల వ‌న్డే ప్ర‌పంచక‌ప్ త‌ర్వాత అత్య‌ధిక మంది చూసిన టోర్నీగా మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్  నిలిచింది. వీడియోల వీక్ష‌ణ విష‌యంలో 2018 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో పోల్చుకుంటే ఇది 20 రేట్లు ఎక్కువ‌గా కాగా, 2017 వ‌న్డే వ‌రల్డ్‌కప్‌తో 10 రేట్లు అధికం. మ‌హిళల క్రికెట్‌కు అభిమానుల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు ఇది ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌మ‌ని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మ‌ను షాన్వి అన్నాడు. మెల్‌బోర్న్ లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజ‌రయ్యారు. 


logo