బుధవారం 08 జూలై 2020
Sports - Apr 23, 2020 , 07:59:24

ఖాళీ మైదానాల్లోనే జ‌ర‌పాలి: భూటియా

ఖాళీ మైదానాల్లోనే జ‌ర‌పాలి:  భూటియా

న్యూఢిల్లీ: ప‌రిస్థితులు కాస్త అదుపులోకి వ‌స్తే.. ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కుండా మ్యాచ్‌లు నిర్వ‌హించ‌డం మంచిద‌ని భార‌త ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా పేర్కొన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్దు కాగా.. ఆట‌గాళ్లంతా ముమ్మ‌రంగా స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. 

ఈ నేప‌థ్యంలో భూటియా మాట్లాడుతూ.. `మ‌హాన‌గ‌రాల్లో చిక్కుకుపోయిన వ‌ల‌స కూలీలకు కావాల్సిన స‌హాయం చేసేందుకు యునైటెడ్ సిక్కీం ఫుట్‌బాల్ క్ల‌బ్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నా. అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌తో ఢిల్లీ, ముంబై వంటి న‌గ‌రాల్లోని నిరుపేద‌ల‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు క‌ల్పిస్తున్నాం. ప్ర‌స్తుతం విప‌త్క‌ర ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఆట‌ల గురించి ఆలోచించ‌డం త‌గ‌దు. అయితే కొవిడ్‌-19 ప్ర‌భావం కాస్త త‌గ్గిన అనంత‌రం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కుండా మ్యాచ్‌లు నిర్వ‌హించ‌డం మంచిది. ఇప్పుడు డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా మ్యాచ్‌లు చూసే అవ‌కాశాలు బాగా పెరిగాయి` అని భూటియా పేర్కొన్నాడు.


logo