శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 23:06:36

ఉమ్మి లేకుండా బౌలింగ్ చేయడం కష్టమే : జహీర్ ఖాన్

ఉమ్మి లేకుండా బౌలింగ్ చేయడం కష్టమే : జహీర్ ఖాన్

ఉమ్మి ఉపయోగించకుండా బౌలింగ్ చేయడం బౌలర్లకు కొంచెం కష్టమే అని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. అయితే పరిస్థితులకు తగినట్లుగా మారాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కిచెప్పారు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

కొవిడ్-19 వ్యాప్తి మధ్య ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచుల్లో ఆడేందుకు క్రికెటర్లు అలవాటు పడాల్సిన అవసరమున్నదని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ చెప్పారు. కొత్త దినచర్యల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త దినచర్యకు అలవాటు పడటం చాలా కష్టమని నేను అననని, ఉమ్మి పెట్టకుండా బౌలింగ్ చేయడం బౌలర్లకు కత్తిమీది సామే అని, అయితే కొత్త నిబంధనలు అనుసరించి ఉమ్మి లేకుండా బౌలింగ్ చేసేలా సాధన చేయాలని సూచించారు. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ను ప్రస్తావిస్తూ మళ్లీ మైదానంలోకి రావడం ఆనందంగా ఉన్నదని భారత మాజీ పేసర్ చెప్పారు.

ముంబై ఇండియన్స్ టీంలోని క్రీడాకారులకు  జిప్ బ్యాగ్‌ను అందించి, దానిలో ఆరోగ్య భద్రతా ప్రోటోకాల్ కట్టుబడి ఉండేలా శిక్షణ బంతులను ఉంచారు. ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం అబుదాబిలో ఉన్నది. 


logo