శుక్రవారం 03 జూలై 2020
Sports - Jun 03, 2020 , 00:15:06

ఉమ్మి వాడకున్నా స్వింగ్‌ చేస్తా: షమీ

 ఉమ్మి వాడకున్నా స్వింగ్‌ చేస్తా: షమీ

కోల్‌కతా: బంతికి సరైన మెరుపు ఉండేలా చేస్తే.. ఉమ్మి రాయకున్నా తాను రివర్స్‌ స్వింగ్‌ చేయగలనని టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ అన్నాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఉమ్మి వాడడం ఆపేస్తేనే బాగుంటుందని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిప్రాయపడ్డాడు. బంతికి చెమట వాడడం వల్ల బౌలర్లకు ఉపయోగం ఉండదని షమీ చెప్పాడు. మాజీ సారథి ధోనీని టీమ్‌ఇండియా ఆటగాళ్లు బాగా మిస్సవుతున్నారని షమీ అన్నాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని 24వ జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న వలస కూలీలకు ఆహార పదార్థాలు, మాస్కులను షమీ మంగళవారం పంపిణీ చేశాడు. 


logo