మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Sep 22, 2020 , 17:08:55

రాజస్థాన్‌తో మ్యాచ్‌.. ఫేవరెట్‌గా చెన్నై

రాజస్థాన్‌తో మ్యాచ్‌.. ఫేవరెట్‌గా చెన్నై

దుబాయ్‌  ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాత్రి జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన ధోనీసేన మరో విజయంపై కన్నేసింది.  గాయం నుంచి కోలుకున్న స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని రాజస్థాన్‌  మంగళవారం తన తొలి పోరులోనే గెలవాలని భావిస్తున్నది.  

 చెన్నైతో  మ్యాచ్‌ ఆడేందుకు కెప్టెన్‌ స్మిత్‌ సిద్ధంగా ఉన్నాడని  ఆ జట్టు కోచ్‌ చెప్పినప్పటికీ బరిలో దిగుతాడా లేదా అనేది  సస్పెన్స్‌గా మారింది. క్వారంటైన్‌ కారణంగా  జోస్‌ బట్లర్‌, వ్యక్తిగత కారణాలతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఇప్పటికే జట్టులో చేరలేదు. ఈ జట్టులో ప్రతిభావంతులైన సంజు శాంసన్‌, యశస్వి జైస్వాల్‌ లాంటి యువ ఆటగాళ్లు ఉన్నారు.

అంబటి రాయుడు సూపర్‌ ఫామ్‌లో ఉండడం చెన్నైకి  కలిసొచ్చే అంశం. పటిష్టలైనప్‌తో ఉన్న  ధోనీసేన మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నది. ముంబైపై విజయంతో ఊపుమీదున్న చెన్నైకి రాజస్థాన్‌ ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి.