ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 20:15:39

ఎల్​పీఎల్​లో పాల్గొనడంపై ఇర్ఫాన్ పఠాన్ క్లారిటీ

ఎల్​పీఎల్​లో పాల్గొనడంపై ఇర్ఫాన్ పఠాన్ క్లారిటీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్​(ఎల్​పీఎల్​)లో పాల్గొనడంపై టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పష్టతనిచ్చాడు. ప్రస్తుతం ఏ లీగ్​ ఆడేందుకు తాను అందుబాటులో లేనని సోమవారం ట్వీట్ చేశాడు. ఆగస్టు 28న శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇర్ఫాన్ ఆడనున్నాడని, శ్రీలంక క్రికెట్ బోర్డు అతడి పేరును పరిగణనలోకి తీసుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఇర్ఫాన్ ఈ విషయంపై స్పందించాడు.

“భవిష్యత్తులో ప్రపంచం మొత్తం టీ20 లీగ్​లు ఆడాలని నేను కోరుకుంటున్నా. కానీ ప్రస్తుతం నేను ఏ లీగ్ కోసం​ అందుబాటులో ఉన్నట్టు చెప్పలేదు” అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. కాగా బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు పరిధిలోని లేని ఆటగాళ్లను విదేశీ లీగ్​లు ఆడేందుకు అనుమతించాలని బీసీసీఐకి ఇర్ఫాన్ ఇటీవలే సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


logo