శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 03:35:59

విండీస్‌, ఆసీస్‌ టీ20 సిరీస్‌ వాయిదా

 విండీస్‌, ఆసీస్‌  టీ20 సిరీస్‌ వాయిదా

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య అక్టోబర్‌లో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ వాయిదా పడింది. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా నిర్వహించాలనుకున్న ఈ సిరీస్‌ను వాయిదా వేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం స్పష్టంచేసింది. దీనికి వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు కూడా సమ్మతించిందని పేర్కొంది. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కారణంగా ఈ ఏడాది ఆసీస్‌ వేదికగా జరుగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే.


logo