శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 26, 2020 , 17:36:05

విండీస్‌ ఢమాల్‌..ఇంగ్లాండ్‌కు భారీ ఆధిక్యం

విండీస్‌ ఢమాల్‌..ఇంగ్లాండ్‌కు భారీ ఆధిక్యం

మాంచెస్టర్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ పట్టు బిగించింది. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే నిర్ణయాత్మక టెస్టులో విండీస్‌ కష్టాల్లో పడింది.  ఆతిథ్య బౌలర్ల ధాటికి విండీస్‌  తడబడటంతో స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. స్టువర్ట్‌ బ్రాడ్‌ బుల్లెట్‌ లాంటి బంతులతో  ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించాడు. బ్రాడ్‌ ఏకంగా 6 వికెట్లతో చెలరేగడంతో కరీబియన్‌ టీమ్‌ 65 ఓవర్లలో 197 పరుగులకు కుప్పకూలింది.   

దీంతో ఇంగ్లాండ్‌ 172 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లీష్‌ బౌలర్లలో జేమ్స్‌ ఆండర్సన్‌  రెండు వికెట్లు పడగొట్టగా జోఫ్రా  ఆర్చర్‌, క్రిస్‌ వోక్స్‌ చెరో వికెట్‌ తీశారు.  టెస్టుల్లో  బ్రాడ్‌ ఐదు, అంతకన్నా ఎక్కువ వికెట్లు  తీయడం ఇది 18వసారి కావడం  విశేషం.  తొలి ఇన్నింగ్స్‌లో  ఇంగ్లాండ్‌ 369 పరుగులకు ఆలౌటైంది. 


logo