ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 01, 2020 , 23:09:49

వింబుల్డ‌న్ టోర్నీ ర‌ద్దు

వింబుల్డ‌న్ టోర్నీ ర‌ద్దు

వింబుల్డ‌న్ టోర్నీ ర‌ద్దు 

లండ‌న్‌: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా టోర్నీల ర‌ద్దు, వాయిదాల ప‌రంప‌ర కొన‌సాగుతున్న‌ది. అంత‌కంతకు వ్యాప్తి చెందుతున్న వైర‌స్‌తో ఇప్ప‌టికే ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డ‌గా, ఘ‌న చ‌రిత్ర క‌ల్గిన వింబుల్డ‌న్ తాజాగా ఈ జాబితాలో చేరింది. వింబ‌ల్డ‌న్-2020 టోర్నీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. షెడ్యూల్ ప్ర‌కారం జూన్ 29 నుంచి మొద‌లుకావాల్సి ఉన్నా...ప్ర‌స్తుతమున్న ప‌రిస్థితిలో టోర్నీ నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మైనందున ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని వారు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. రెండో ప్ర‌పంచ యుద్దం త‌ర్వాత ఈ మెగా టోర్నీ ర‌ద్దు కావ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. గ‌త కొన్ని రోజులుగా టోర్నీ జ‌రుపాలా వద్దా అన్న సుదీర్ఘ చ‌ర్చ‌ల త‌ర్వాత ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్ల‌బ్‌(ఏఈఎల్‌టీసీ) తుది నిర్ణ‌యానికి వ‌చ్చింది. ‘ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని వింబుల్డ‌న్ 2020 టోర్నీని ర‌ద్దు చేశాం. ఆల్ ఇంగ్లండ్ క్ల‌బ్‌, చాంపియ‌న్‌షిప్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి’ అని ఏఈఎల్ టీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. వచ్చే ఏడాది వింబ‌ల్డ‌న్ జూన్ 28 నుంచి జూలై 11 మ‌ధ్య జ‌రుగ‌నుంది. ఇదిలా ఉంటే కొవిడ్‌-19 కార‌ణంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెప్టెంబ‌ర్ 20కి వాయిదా ప‌డింది. క‌రోనా వైర‌స్‌తో బ్రిట‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2352 మంది చనిపోయారు. 


logo