శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 11, 2020 , 02:15:31

వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ పంపిణీ

 వింబుల్డన్‌  ప్రైజ్‌మనీ పంపిణీ

వింబుల్డన్‌: వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ పంపిణీకి రంగం సిద్ధమైంది. కరోనా వైరస్‌ కారణంగా 1945 తర్వాత తొలిసారి వింబుల్డన్‌ రద్దయినా..ప్లేయర్లను ఆదుకునేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు. మొత్తం 620 మంది ప్లేయర్లకు రూ.939 కోట్ల  ప్రైజ్‌మనీ అందజేస్తామని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. బీమా సంస్థను సంప్రదించిన తర్వాత రద్దు కారణంగా వచ్చే మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యామని క్లబ్‌ తెలిపింది. ఇందులో మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన 256 మంది ప్లేయర్లకు రూ.23లక్షలు, అర్హత రౌండ్‌ ఆడిన వారికి రూ.11లక్షలు దక్కనున్నాయి. వీరితో పాటు డబుల్స్‌లో పోటీపడ్డ ప్లేయర్లకు ఒక్కోక్కరికి రూ.5.86లక్షలు దక్కనున్నాయి.


logo