గురువారం 04 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 00:52:34

వింబుల్డన్‌ రద్దు

వింబుల్డన్‌ రద్దు

  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి 

లండన్‌: కరోనా వైరస్‌ విజృంభణతో ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ టోర్నీ ఈ ఏడాది రద్దయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ పురాతన గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ జరుగకపోవడం ఇదే తొలిసారి. బుధవారం నిర్వహించిన సమావేశం తర్వాత ఆల్‌ ఇంగ్లండ్‌ టెన్నిస్‌ క్లబ్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అలాగే,  వచ్చే ఏడాది వింబుల్డన్‌ టోర్నీని జూన్‌ 28 నుంచి జులై 11 మధ్య నిర్వహించనున్నట్టు ప్రకటించింది.  షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జూన్‌ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు టోర్నీ జరగాల్సింది. కానీ, కరోనా వల్ల రద్దవుతున్న టోర్నీల జాబితాలో చేరింది. 

యుద్ధ ప్రభావం లేకుండా మొదటిసారి

వింబుల్డన్‌  1877లో ప్రారంభమై, ప్రతి ఏడాది జరుగుతుండేది. అయితే, మొదటి ప్రపంచ యుద్ధంతో 1915-18 మధ్య, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940-45 మధ్య జరుగలేదు. ఆ తర్వాత మళ్లీ 75ఏండ్లకు కరోనా కారణంగా ఇప్పుడు రద్దయింది. ఈ ఏడాది తర్వాతి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి జరగాల్సి ఉంది. మేలో ప్రారంభం కావాల్సిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెప్టెంబర్‌కు వాయిదా పడింది. 


logo