విలియమ్సన్ ద్విశతకం

హామిల్టన్(న్యూజిలాండ్): కెప్టెన్ కేన్ విలియమ్సన్(412 బంతుల్లో 251; 12ఫోర్లు, ఓ సిక్స్) అద్భుతంగా ఆడి ద్విశతకం సాధించడంతో వెస్టిండీస్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం ఏడు వికెట్లకు 519 పరుగుల వద్ద కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెరీర్లో మూడో డబుల్ సెంచరీ చేసిన కేన్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 243/2 ఓవర్‌నైట్ స్కోరు వద్ద రెండో రోజు ఆట కొనసాగించిన కివీస్ త్వరగానే టేలర్ (38) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నికోల్స్ (7), బ్లండెల్ (14), డారిల్ మిచెల్ (9) వెనువెంటనే ఔటైనా మరో ఎండ్‌లో విలియమ్సన్ సాధికారికంగా ఆడాడు. అతడికి కైల్ జెమీసన్ (51నాటౌట్) చక్కగా సహకరించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ముందుకుసాగిన విలియమ్సన్ 369 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విండీస్ బౌలర్లలో రోచ్, గాబ్రియెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 49 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (20 నాటౌట్), క్యాంప్‌బెల్ (22నాటౌట్) క్రీజులో ఉన్నారు.
తాజావార్తలు
- డ్రాగన్‌కు రాంరాం: ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తి పైపైకి!
- కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం నిరసన
- ప్రతి మొక్కనూ సంరక్షించాలి : ముత్తిరెడ్డి
- రూ. 4.33 కోట్లతో వాటర్ నిర్మాణం
- క్రీడలతో పెరుగనున్న స్నేహభావం : డీసీపీ
- అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
- పార్లమెంట్ క్యాంటిన్లో నో సబ్సిడీ: ధరలు తడిసిమోపెడు
- బడ్జెట్లో సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడు?
- కరువు నేలకు జలాభిషేకం!
- టీసీఎస్ @ 3