బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 00:35:58

విలియమ్సన్‌ శతకం

విలియమ్సన్‌ శతకం

మౌంట్‌ మాంగనీ: కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (297 బంతుల్లో 129) సెంచరీతో అదరగొట్టడంతో పాకిస్థాన్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆదివారం ఆటలో కేన్‌తో పాటు బీజే వాట్లింగ్‌ (73), హెన్రీ నికోల్స్‌ (56) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 431 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది.  పాకిస్థాన్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది నాలుగు, యాసిర్‌ షా మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బరిలోకి దిగిన పాకిస్థాన్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 30 పరుగులు చేసింది. అబిద్‌ అలీ (19 బ్యాటింగ్‌), నైట్‌ వాచ్‌మన్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.


logo