శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 00:31:00

విలియమ్సన్‌ @ 2

విలియమ్సన్‌ @ 2

దుబాయ్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముందంజ వేశాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి 886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. స్టీవ్‌ స్మిత్‌ (911) టాప్‌లో ఉన్నాడు. భారత్‌ నుంచి కోహ్లీతో పాటు చతేశ్వర్‌ పుజారా (7వ ర్యాంక్‌) మాత్రమే టాప్‌ టెన్‌లో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో 779 పాయింట్లతో జస్ప్రీత్‌ బుమ్రా తొమ్మిదో స్థానంలో ఉండగా.. కమిన్స్‌ (904) అగ్రస్థానంలో ఉన్నాడు.


logo