గురువారం 16 జూలై 2020
Sports - May 18, 2020 , 21:34:49

'ఆ 20సెంటీమీటర్ల గురించి మరో 50ఏండ్లు ఆలోచిస్తా'

'ఆ 20సెంటీమీటర్ల గురించి మరో 50ఏండ్లు ఆలోచిస్తా'

వెల్లింగ్టన్‌:  గతేడాది వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ దురదృష్టం కొద్ది చేజారడంపై న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మి నీషమ్‌ ఇప్పటికే చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా సూపర్‌ చివరి బంతికి మార్టిన్‌ గప్టిల్‌ రనౌట్‌ అయిన సందర్భాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. డైవ్‌ చేసినా క్రీజుకు గప్టిల్‌ అప్పుడు 20 సెంటీమీటర్ల దూరంలో ఉండిపోయాడని, ఆ దూరం గురించి తాను మరో 50ఏండ్లయినా ఆలోచిస్తానని సోమవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

గతేడాది లార్డ్స్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తొలుత న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ సమానమైన స్కోర్లు(241) చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌ 16పరుగులు చేయాల్సింది. అయితే చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. తొలి పరుగు పూర్తి గప్టిల్‌, నీషమ్‌ పూర్తి చేశారు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో డైవ్‌ చేసినా గప్టిల్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో సూపర్‌ ఓవర్‌ కూడా టై కాగా, బౌండరీలు ఎక్కువ బాదిన ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ టైటిల్‌ దక్కింది. ఈ విషయంపై నీషమ్‌ తాజాగా స్పందించాడు. ఆ సందర్భాన్ని తానెప్పటికీ మరిచిపోలేనని అన్నాడు. 

'సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు 16పరుగులు ఛేదించడం కష్టమేనని అనుకున్నా. ఎందుకంటే అప్పుడు ఒత్తిడి ఆ స్థాయిలో ఉంది. 16పరుగులు చేయలేకున్నా ఎవరూ మమ్మల్ని నిందించరని అనుకున్నా. బంతిని బాగా బాదితే సాధ్యమనుకున్నా. అలాగే దాదాపు చేరువయ్యాం. కానీ ఒక్క పరుగు, 20 సెంటీమీటర్ల దూరం దెబ్బతీసింది.. ఆ 20సెంటీమీటర్ల గురించి నేను తర్వాతి 50ఏండ్ల వరకు కూడా ఆలోచిస్తా'  అని నీషమ్‌ చెప్పాడు.  


logo