శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Oct 02, 2020 , 02:02:14

ఐపీఎల్‌లో రైజర్స్‌ దూకుడు సాగేనా..?

ఐపీఎల్‌లో  రైజర్స్‌  దూకుడు సాగేనా..?

దుబాయ్‌: ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌), చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) శుక్రవారం తలపడనున్నాయి. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు ఎదుర్కొన్న హైదరాబాద్‌, చెన్నై  ఆఖరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. విలియమ్సన్‌ రాక, రషీద్‌ మ్యాజిక్‌తో గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచిన వార్నర్‌సేన పాయింట్ల ఖాతా తెరువగా.. ముంబైపై విజయం తర్వాత చెన్నై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసింది. గెలుపుతో ఆత్మవిశ్వాసంతో ఉన్న హైదరాబాద్‌..ఇదే జోరు కొనసాగిస్తూ ఒత్తిడిలో ఉన్న చెన్నైని చిత్తు చేయాలని చూస్తున్నది. 

జట్టులోకి రాయుడు, బ్రావో!

మరోవైపు అంబటి రాయుడు, డ్వైన్‌  బ్రావో పూర్తి ఫిట్‌నెస్‌  సాధించడం చెన్నైకు ఊరట కలిగించే విషయం. ఈ ఇద్దరూ ఉంటే  జట్టులో సమతూకం పెరుగుతుంది. వరుసగా విఫలమవుతున్న మురళీ విజయ్‌ స్థానంలో రాయుడు, సామ్‌  కరన్‌  ప్లేస్‌లో బ్రావో జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


logo