శుక్రవారం 03 జూలై 2020
Sports - May 20, 2020 , 22:51:02

'అందుకోసం కాస్త ప్రాక్టీస్‌ చేయాల్సిందే'

'అందుకోసం కాస్త ప్రాక్టీస్‌ చేయాల్సిందే'

న్యూఢిల్లీ: క్రికెట్‌లో బంతికి ఉమ్మి రాయడం క్రికెటర్లకు అలవాటుగా ఉందని, దాన్ని మానేయాలంటే కాస్త ప్రాక్టీస్‌ చేయాల్సిందేనని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే బౌలర్లు కూడా కొత్త పద్ధతికి అలవాటు పడాల్సి ఉంటుందని చెప్పాడు. ఐపీఎల్‌లో తన ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్లో అశ్విన్‌ బుధవారం పలు అంశాలపై మాట్లాడాడు. 

'మళ్లీ క్రికెట్‌ ఆడేందుకు ఎప్పుడు బరిలోకి దిగుతామో నాకు తెలియదు.  బంతికి ఉమ్మి రాయడం నాకు అలవాటైంది. అలా చేయకుండా ఉండాలంటే ముందు కొంత ప్రాక్టీస్‌ అవసరం. అయితే ఉమ్మి రాయకుండా బౌలింగ్‌ చేయడాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి' అని అశ్విన్‌ అన్నాడు. కాగా కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించాలని భారత దిగ్గజం అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని టెక్నికల్‌ కమిటీ ఐసీసీకి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా తర్వాత క్రికెట్‌ ప్రారంభమైనా.. బంతి నుంచి స్వింగ్‌ రాబట్టేందుకు ఆటగాళ్లు ఉమ్మి రాయడం కనిపించకపోవచ్చు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా కృత్తిమ ప్రదార్థాన్ని తీసుకురావాలని ఐసీసీకి కొందరు సూచిస్తున్నారు. 


logo