మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 26, 2021 , 10:34:22

పుజారా అలా చేస్తే.. నా స‌గం మీసం తీసేస్తా: అశ్విన్

పుజారా అలా చేస్తే.. నా స‌గం మీసం తీసేస్తా: అశ్విన్

ముంబై: ఇండియ‌న్ టీమ్ బ్యాట్స్‌మ‌న్ చెటేశ్వ‌ర్ పుజారా సంగ‌తి తెలుసు క‌దా. టెస్టుల్లో ఆచితూచి ఆడుతూ వికెట్లకు అడ్డుగోడ‌లా నిల‌బ‌డ‌టం అత‌నికి అల‌వాటు. ఎప్పుడైనా పుజారా క్రీజు వ‌దిలి ముందుకు వ‌చ్చి అలా సిక్స్ కొట్టడం చూశారా? ఇప్ప‌టి వ‌ర‌కూ అది చాలా మందికి తీర‌ని కోరిక‌గానే మిగిలిపోయింది. టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గాఉన్న విక్ర‌మ్ రాథోడ్ కూడా ఇదే చెబుతున్నాడు. టీమిండియా స్పిన్న‌ర్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో అత‌నితో క‌లిసి మాట్లాడాడు రాథోడ్‌. ఈ సంద‌ర్భంగా పుజారా గురించి మాట్లాడుతూ.. ఒక్క‌సారైనా క్రీజు బ‌య‌ట‌కు వ‌చ్చి సిక్స్ కొట్ట‌మ‌ని పుజారాకు నేను చెబుతున్నాను. కానీ అత‌డు మాత్రం విన‌డం లేదు. ఏవేవో కారణాలు చెబుతున్నాడు అని చెప్పాడు. 

ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న అశ్విన్‌.. ఒక‌వేళ వ‌చ్చే ఇంగ్లండ్ సిరీస్‌లో మొయిన్ అలీ లేదా ఏ స్పిన్న‌ర్ బౌలింగ్‌లో అయినా పుజారా ఆ ప‌ని చేస్తే నేను నా సగం మీసం తీసేసి అలాగే ఆడ‌తాను. ఇది నా ఓపెన్ చాలెంజ్ అని అశ్విన్ న‌వ్వుతూ చెప్పాడు. ఈ చాలెంజ్ బాగుంది. అత‌డు దీనిని స్వీక‌రిస్తే బాగుంటుంది. కానీ పుజారా ఆ ప‌ని చేస్తాడ‌ని అనుకోవ‌డం లేదు అని రాథోడ్ అన్నాడు. అత‌ని డిఫెన్సివ్ ఆట తీరును చాలా మంది తిడ‌తారు కానీ.. పుజారా నా ఫేవ‌రెట్ బ్యాట్స్‌మ‌న్‌. అత‌డు ఏ కోచ్‌కైనా ఓ డ్రీమ్ అని రాథోడ్ అన్నాడు.

VIDEOS

logo