రోహిత్ శర్మ రేపు జట్టుతో కలుస్తాడు: రవిశాస్త్రి

మెల్బోర్న్:తొడకండరాల గాయం నుంచి కోలుకొని సిడ్నీలో క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మూడో టెస్టు ఆడతాడో లేదో అనే దానిపై ఇంకా స్పష్టతరాలేదు. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు ఆరంభంకానుంది. బుధవారం రోహిత్ మెల్బోర్న్లో ఉన్న భారత జట్టుతో కలుస్తాడని టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ముందుగా అతని అభిప్రాయాన్ని తెలుసుకుంటామని వివరించాడు.
అతనితో ఇప్పటికే మాట్లాడామని చెబుతున్న శాస్త్రి..మూడో టెస్టులో హిట్‌మ్యాన్ ఆడే విషయమై టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతోంది. 'రోహిత్ రేపు జట్టులో చేరుతాడు. గతకొన్ని రోజులుగా అతడు క్వారంటైన్లో ఉన్నాడు కాబట్టి ముందుగా అతడితో మాట్లాడి తన ఫిజికల్ ఫిట్‌నెస్‌పై చర్చించి, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని' రవిశాస్త్రి పేర్కొన్నాడు.
తాజావార్తలు
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
- కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు రెడీ అంటున్న ప్రియమణి
- యూకేలో జూలై 17 వరకు లాక్డౌన్ పొండగింపు
- పెళ్లికి ముందు కారు యాక్సిడెంట్ చేసిన వరుణ్