గురువారం 09 జూలై 2020
Sports - May 11, 2020 , 15:56:43

ఎలైట్ అథ్లెట్ల‌తోనే ట్రైనింగ్ ఆరంభం: రిజిజు

ఎలైట్ అథ్లెట్ల‌తోనే ట్రైనింగ్ ఆరంభం:  రిజిజు

న్యూడిల్లీ:  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ముగియ‌గానే.. అగ్ర‌శ్రేణి అథ్లెట్ల శిక్ష‌ణ షురూ చే్స్తామ‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు పేర్కొన్నాడు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మొద‌ట ఈ నెల 3 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన స‌మ‌యంలో రిజిజు మాట్లాడుతూ.. నెలాఖ‌రు వ‌ర‌కు క్రీడా ప్రాంగ‌ణాల్లో శిక్ష‌ణ ప్రారంభిస్తామ‌న్నారు. అయితే కొవిడ్‌-19 వ్యాప్తి త‌గ్గ‌క‌పోవ‌డంతో మ‌రో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. 

ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి సోమ‌వారం మాట్లాడుతూ.. `ఒక్క‌సారి లాక్‌డౌన్ ముగియ‌గానే.. మొద‌ట అగ్ర‌శ్రేణి ప్లేయ‌ర్ల‌కు శిక్ష‌ణ ప్రారంభిస్తాం. అయితే ఆట‌గాళ్ల‌తో పాటు స్టేక్ హోల్డ‌ర్‌ల‌కు ఒక విజ్ఞ‌ప్తి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వ‌డం మంచిది. అందుకే ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ స‌మూహాలుగా ఉండ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి` అని అన్నారు.logo