శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 01, 2021 , 16:31:30

ఇప్ప‌ట్లో రిటైర‌వ‌ను.. ఇంకో రెండు వ‌రల్డ్‌క‌ప్‌లు ఆడ‌తా!

ఇప్ప‌ట్లో రిటైర‌వ‌ను.. ఇంకో రెండు వ‌రల్డ్‌క‌ప్‌లు ఆడ‌తా!

యూనివ‌ర్స్ బాస్ క్రిస్ గేల్ 41 ఏళ్ల వ‌య‌సులోనూ రిటైర్మెంట్ ఆలోచ‌న‌లు లేవ‌ని అంటున్నాడు. ఇంకో రెండు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు ఆడ‌తాన‌ని తేల్చి చెప్పాడు. మరో ఐదేళ్లు క్రికెట్ ఆడే స‌త్తా త‌న‌లో ఉన్న‌ద‌ని, 45 ఏళ్ల‌కు ముందు రిటైర్ అయ్యే ప్ర‌స‌క్తే లేద‌ని గేల్ అన్నాడు. వ‌య‌సు కేవ‌లం ఒక నంబ‌రే అని కొట్టి పారేస్తున్నాడు. అల్టిమేట్ క్రికెట్ చాలెంజ్ (యూకేసీ) టోర్నీలో భాగంగా గేల్ మాట్లాడాడు. 

ఈ క్రికెట్ సిరీస్‌లో గేల్‌తోపాటు యువ‌రాజ్ సింగ్‌, ఇయాన్ మోర్గాన్‌, ఆండ్రీ ర‌సెల్‌, కెవిన్ పీట‌ర్స‌న్‌, ర‌షీద్ ఖాన్ పాల్గొంటున్నారు. 16 మ్యాచ్‌లు ఈ టోర్నీ ఓ స‌రికొత్త ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నుంది. ఒక్కో ప్లేయ‌ర్ మ‌రో ప్లేయ‌ర్‌తో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మొత్తం 4 ఇన్నింగ్స్‌. ఒక్కో ఇన్నింగ్స్‌లో 15 బాల్స్‌. ఎవ‌రు ఎక్కువ ర‌న్స్ చేస్తే వాళ్లు సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌తారు. ఈ ఫార్మాట్ చాలా కొత్త‌గా, ఆస‌క్తిగా ఉన్న‌ద‌ని గేల్ అన్నాడు. 


logo