శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Nov 08, 2020 , 15:26:13

విల్‌ యూ మిస్‌ చాచాకీ కామెడీ! : సెహ్వాగ్‌

విల్‌ యూ మిస్‌ చాచాకీ కామెడీ! : సెహ్వాగ్‌

న్యూఢిల్లీ : వీరేంద్ర సెహ్వాగ్.. భారత క్రికెట్‌ మాజీ డాషింగ్ ఓపెనర్. గతంలో క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ.. అభిమానులకు కనుల విందు చేసే వాడు. క్రికెట్‌కి దూరమైనా తనదైన కామెడీ టైమింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు ఈ మాజీ క్రికెటర్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ నవ్విస్తుంటాడు.. తాజాగా అమెరికా ఎన్నికల్లో పరాజయం పాలైన ట్రంప్‌నుద్దేశించి పెట్టిన కామెంట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘చాచాకీ కామెడీ మిస్‌ అవుతున్నాం’ అంటూ ట్రంఫ్‌ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.