సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 21, 2021 , 14:52:28

మా నాన్న‌కు దెబ్బ త‌గిలిన ప్ర‌తి చోటా ముద్దిస్తా: పుజారా కూతురు

మా నాన్న‌కు దెబ్బ త‌గిలిన ప్ర‌తి చోటా ముద్దిస్తా: పుజారా కూతురు

ముంబై: ఎంతైనా కూతురు కూతురే. ఓ తండ్రిపై కూతురు చూపించే ప్రేమ‌కు ప్ర‌పంచంలో మ‌రేదీ సాటిరాదు. ఇప్పుడు అలాంటి ప్రేమే టీమిండియా బ్యాట్స్‌మ‌న్ చెటేశ్వ‌ర్‌ పుజారాకు ద‌క్కింది. అత‌ని రెండేళ్ల కూతురు ముద్దు ముద్దుగా చెప్పిన మాట‌లు.. ఆసీస్ గ‌డ్డ‌పై త‌న‌కు త‌గిలిన గాయాల‌ను మాన్పించేశాయి. బ్రిస్బేన్‌లో జ‌రిగిన చివ‌రి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పుజారా ఆసీస్ బౌల‌ర్ల షార్ట్ పిచ్ బాల్స్‌కు చాలాసార్లే గాయ‌ప‌డ్డాడు. ఏది ఏమైనా త‌న వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో ఒంటికి ఎన్ని దెబ్బ‌లు త‌గిలినా త‌ట్టుకున్నాడు. క‌మిన్స్‌, హేజిల్‌వుడ్ వేసిన బంతులు ఒళ్లంతా గాయాలు చేస్తున్నా.. చెక్కు చెద‌ర‌ని ఏకాగ్ర‌త‌తో అత‌ను బ్యాటింగ్ చేశాడు. చివ‌రి రోజు ఆట‌లో క‌నీసం 12సార్ల‌యినా బంతి అత‌ని శ‌రీరాన్ని బలంగా తాకింది. 

గాయాలు అల‌వాటే..

ఆస్ట్రేలియా టూర్‌లో వ‌రుస‌గా రెండోసారి కూడా వెయ్యికి పైగా బంతుల‌ను ఎదుర్కొన్నాడు పుజారా. అక్క‌డి బౌన్సీ పిచ్‌ల‌పై అంత సేపు క్రీజులో ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ర‌య్యిమంటూ దూసుకొచ్చే బాల్స్‌.. ఎక్క‌డ గాయాలు చేస్తాయోన‌న్న ఆందోళ‌న బ్యాట్స్‌మెన్‌లో క‌నిపిస్తుంది. కానీ పుజారా మాత్రం ఆ గాయాల‌కు తాను అల‌వాటు ప‌డ్డట్లు చెబుతున్నాడు. చిన్న‌ప్ప‌టి నుంచీ తాను పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోన‌ని, అందుకే బాధ‌ను భ‌రించ‌డం త‌న‌కు ఓ అల‌వాటుగా మారింద‌ని పుజారా చెబుతున్నాడు. అయితే ఇన్ని గాయాల మ‌ధ్య కూడా త‌న కూతురు చెప్పిన మాట‌లు త‌న బాధ‌ల‌న్నింటినీ దూరం చేశాయ‌ని అత‌ను చెప్పాడు. మా నాన్న ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత అత‌నికి ఎక్క‌డ దెబ్బ త‌గిలిందో అక్కడ ముద్దిస్తా అని పుజారా రెండేళ్ల కూతురు అదితి చెప్ప‌డం విశేషం. త‌న కూతురు ఎప్పుడు కింద ప‌డినా తానూ అలాగే చేస్తాన‌ని, అందుకే ముద్దు ఏ గాయాన్ని అయినా మాన్పుతుంద‌ని త‌న కూతురు అనుకుంటుంద‌ని పుజారా చెప్పాడు. 

VIDEOS

తాజావార్తలు


logo