సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 16, 2020 , 14:04:38

ధోనీ జెర్సీ నంబర్ '7'కు రిటైర్మెంట్!

ధోనీ జెర్సీ నంబర్ '7'కు రిటైర్మెంట్!

న్యూఢిల్లీ:  టీమిండియా మాజీ సారథి  మహేంద్రసింగ్‌ ధోనీ  జెర్సీ నంబర్ 7 అంటే అభిమానులకు ఎంతో ఇష్టం.   ఆ జెర్సీ నంబర్ ధరించిన  మహీ ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ  విజయాలను అందించడంతో పాటు వ్యక్తిగత  రికార్డులను కూడా  నెలకొల్పాడు.  ఇకపై   ధోనీ జెర్సీ నంబర్  7 ఇతర క్రికెటర్లు ధరించకుండా నిషేధం విధించాలని పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్   రిటైర్మెంట్ ప్రకటించిన  తర్వాత అతని సేవలకు గుర్తింపుగా ఆ జెర్సీని ఇతర క్రికెటర్లు  ధరించకుండా  బీసీసీఐ నెం.10 జెర్సీకి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.   

మహీ గౌరవార్థం  నంబర్‌  ‘7’కు  శాశ్వత   రిటైర్మెంట్‌ ప్రకటించాలని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ ట్విటర్‌ వేదికగా కోరాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో  జెర్సీ #7కు   బీసీసీఐ  వీడ్కోలు పలుకుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు.  జీవితంలో  ధోనీ సెకండ్‌  ఇన్నింగ్స్‌ కూడా గొప్పగా ఉండాలని ఆకాంక్షించాడు.  ఈ సందర్భంగా ధోనీతో వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌ సమయంలో దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. 


logo